ఎల్ఎండీ నుంచి 6 గేట్ల ద్వారా నీటి విడుదల 

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ పరిధిలోని ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి ఇన్ ఫ్లో తగ్గింది. మంగళవారం మిడ్ మానేర్, మోయ తుమ్మెద వాగుల నుంచి సుమారు 52 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో రాగా 8 గేట్లు ఎత్తి నీటిని విడదల చేశారు. బుధవారం వరద తగ్గుముఖం పట్టడంతో 6 గేట్ల ద్వారా సుమారు 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల  చేస్తున్నారు.  

ALSO READ:ముంపు బాధితులకు .. పరిహారం చెక్కులు అందజేత 

రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 22.918 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్ మానేర్ కు 10 వేల క్యూసెక్కులు.. బోయినిపల్లి: బోయినిపల్లి మండలంలో శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేర్)కు ఇన్ ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి 3500 క్యూసెక్కులు, మూల, మానేరు వాగుల ద్వారా 6,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 5 గేట్ల నుంచి ఎల్ఎండీ కి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.