మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకీ నీటి విడుదల
రాజన్న సిరిసిల్ల, బోయినిపల్లి, వెలుగు : జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం పడింది. కామారెడ్డి పాల్వంచ వాగు,కూడెల్లి వాగు నుంచి వరద రావడంతో ఎగుమ మానేరు మత్తడి దుంకుతోంది. మిడ్ మానేర్ కు 27వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 6 గేట్లు ఎత్తి 32,610 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 27.50 టీఎంసీలకు 20.427 టీఎంసీలకు చేరుకుంది. సిరిసిల్ల పట్టణంలో సంజీవయ్యనగర్,శాంతినగర్ లోతట్లు కాలనీలు నీటమునిగాయి.
మోతు వాగుపై నిలిచిన రాకపోకలు
రామడుగు : కరీంనగర్జిల్లా రామడుగు మండలం మోతె వాగు వరద ప్రవాహం పెరగడంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేవారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జి వద్ద కోతకు గురికాగా రాకపోకల కోసం తాత్కాలికంగా మట్టిపోశారు. ప్రస్తుత వానలకు తాత్కాలిక బ్రిడ్జి మట్టి కొట్టుకుపోయింది.