నాగార్జునసాగర్‌‌ 6  గేట్ల నుంచి నీటి విడుదల ​ 

హాలియా, వెలుగు : శ్రీశైలం డ్యాం నుంచి వరద పెరిగిన నేపథ్యంలో నాగార్జునసాగర్ ​ప్రాజెక్టు 590 అడుగుల (312.50 టీఎంసీ)లతో  గరిష్ట స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో గురువారం సాయంత్రం డ్యాం అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​ ఆరు  క్రస్టు గేట్లను 5  ఫీట్ల మేరకు ఎత్తి 48,600 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి నాగార్జునసాగర్ కు 95,578  క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. 

590 అడుగుల నీటి మట్టం..

నాగార్జునసాగర్​ ప్రాజెక్టు కెపాసిటీ 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 590  అడుగుల గరిష్ట స్థాయి నీటిమట్టానికి చేరింది. సాగర్‌‌ నుంచి కుడి కాల్వ ద్వారా 7,528 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7,518 క్యూసెక్కులు, విద్యుత్​ఉత్పత్తి కోసం 29,232 క్యూసెక్కులు, ఎస్‌‌ఎల్‌‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు.