నారాయణపూర్  డ్యాం నుంచి రెండు రోజుల్లో నీటి విడుదల

నారాయణపూర్  డ్యాం నుంచి రెండు రోజుల్లో నీటి విడుదల

గద్వాల, వెలుగు: రెండు రోజుల్లో కర్నాటకలోని నారాయణపూర్  డ్యాం నుంచి సాగు, తాగునీటి  అవసరాల కోసం నీటి విడుదల చేసే అవకాశం ఉందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం గట్టు మండలం గొర్లఖాన్​దొడ్డి సమీపంలో ఉన్న కాలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగునీటికి ఇబ్బందులు ఉండడంతో సీఎం సూచన మేరకు కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడడం జరిగిందన్నారు.

రెండు రోజుల్లో అక్కడి నుంచి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, నిర్దేశించిన ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, మాజీ జడ్పీటీసీ రాజశేఖర్  ఉన్నారు.