ఎస్సారెస్పీ వరద కాల్వకు నీటి విడుదల

ఎస్సారెస్పీ వరద కాల్వకు నీటి విడుదల

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ వరద కాల్వకు సోమవారం నీటిని వదిలారు. హెడ్ రెగ్యులేటర్‌ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్ట్ లోకి 14,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో కాకతీయ కాల్వకు 6 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండింది.

సింగూరు గేట్‌ ఓపెన్‌

పుల్కల్ : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు  ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో అలర్ట్‌ అయిన ఆఫీసర్లు 11 నంబర్‌ గేటును 1.5 మీటర్లు ఎత్తి 9,654 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సింగూరు పూర్తి స్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.708 టీఎంసీల నీరు నిల్వ ఉందని డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు.