నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద.. తాగునీటికోసం ఎడమకాల్వకు నీటి విడుదల

నల్లగొండ: తెలంగాణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నాగా ర్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. సాగర్ ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 504 అడుగులుగా ఉంది. 

తెలంగాణ ప్రజలను తాగునీటి అవసరాల కోసం ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రోజుకు 3వేల క్యూసెక్కుల చొప్పున మూడు రోజుల పాటు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నారు. దీంతో  ఎడమ కాల్వ కింద ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో తాగునీటి సమస్య తీరనుంది.

also read : ఆదిలాబాద్ జిల్లాలో పండుగలా రుణమాఫీ