హైదరాబాద్, వెలుగు: సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఎండలు ముదురుతుండగా.. సిటీలో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. డిమాండ్‌కు సరిపడా నీటిని పంపిణీ చేస్తామని వాటర్‌బోర్డు చెబుతున్నా ఆచరణలో చూపడంలేదు. దీంతో నీటి కొరత ఎదుర్కొంటున్నవారు ప్రైవేట్ట్యాంకర్లను కొనుగోలు చేస్తుండగా.. ఇదే అదనుగా నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ఆర్డర్‌చేసిన కొన్ని గంటల్లోనే సప్లై చేస్తుండగా.. ధర మాత్రం అధికంగా ఉంటోంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు చొప్పున తీసుకుంటున్నారు. ముఖ్యంగా కోర్ సిటీతో పాటు ఓఆర్ఆర్సమీప గ్రామాలు, మున్సిపాలిటీలకు వాటర్‌బోర్డు నీటిని అందిస్తోంది. సమ్మర్ నేపథ్యంలో నీటి డిమాండ్పెరుగుతుంటే.. అందుకు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతుండగా శివారు ప్రాంతాల్లో నీటి కొరత మొదలైంది. ప్రైవేట్ట్యాంకర్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణ లేకపోగా నిర్వాహకులు ఇష్టం వచ్చినట్టుగా ధరలు తీసుకుంటున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే లో మరింతగా కొరత రావొచ్చని, ప్రైవేట్నీటి సప్లై నిర్వాహకులపై ప్రభుత్వ నియంత్రణ ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ
కోర్‌సిటీలో నీటి సమస్య పెద్దగా లేదు. శివారు ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, దుండిగల్, హకీంపేట, శామీర్‌పేట, బొల్లారం, ఆల్వాల్, నాగారం, రాంపల్లి, కుషాయిగూడ, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్, బాట సింగారం, ప్రతాప సింగారం, నార్సింగి, గండిపేట, శంకర్పల్లి, శంషాబాద్, మంచిరేవుల, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, చందానగర్, మియాపూర్తదితర ప్రాంతాల్లో రోజురోజుకూ నీటి తీవ్రం అవుతోంది. దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు ట్యాంకర్లతో నీటిని అమ్ముతుండగా.. ఒక్కో ట్యాంకర్(5 వేల లీటర్లు)కు రూ. 800 – రూ. 1000 , 10వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ. 1200 – రూ.1500 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ట్యాంకర్ల నిర్వాహకులకు ఫోన్‌చేసిన రెండు మూడు గంటల్లోనే నీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే.. చార్జీలు మాత్రం అధికంగా ఉంటున్నట్టు కొనుగోలుదారులు చెబుతున్నారు. సమ్మర్ మూడు నెలలు మాత్రమే జరిగే వ్యాపారమని, ఆ తర్వాత పెద్దగా డిమాండ్ఉండదని వెంకట్‌రెడ్డి అనే వాటర్సప్లయర్ తెలిపారు. అందుకే అధిక ధర వసూలు చేస్తున్నామని చెప్పారు. బోర్‌వెల్స్ ఓనర్లతో అగ్రిమెంట్ చేసుకుని నీటిని తీసుకుంటామని, వారికి చెల్లించే డబ్బులతో పాటు తమకు కూడా మిగలాలి కదా అని.. మరికొందరు ట్యాంకర్ల నిర్వాహకులు పేర్కొన్నారు. శివారు ప్రాంతాల్లో 1,800 – 2 వేల మంది వరకూ ప్రైవేట్ వాటర్సప్లయర్స్ఉన్నారు. సమ్మర్లో డిమాండ్ అధికంగా ఉంటుండగా.. ఒక్కో ట్యాంకర్రోజుకు 8 నుంచి 12 ట్రిప్పులు కొడుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Also Read: కాల్వలు సక్కగ లేక చివరికి అందని సాగునీరు
ఆర్డర్లు పెరుగుతుండగా ఫుల్ డిమాండ్
వాటర్‌బోర్డు సప్లై చేసే ట్యాంకర్లకు ఫుల్‌డిమాండ్ ఉంటుంది. రోజుకు 2,000 – 2500 వరకు ఆర్డర్లు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. బోర్డు పరిధిలోని 72 ఫిల్లింగ్పాయింట్ల నుంచి నీటిని పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 500 పైగా ట్యాంకర్లు ఉండగా.. సమ్మర్ లో మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోర్డు సరఫరా చేసే నీటికి రోజు రోజుకూ ఆర్డర్లు పెరుగుతుండగా.. ఒక్కో ట్యాంకర్(5వేల లీటర్లు) రూ. 500, రూ. 10వేల లీటర్లకు రూ. 850 వసూలు చేస్తున్నారు. ప్రస్తుత డిమాండ్‌ను బట్టి ఆర్డర్ ఇచ్చిన 24 గంటలు కానీ, ఒక్కోసారి 48 గంటల్లో పంపిణీ చేస్తున్నారు. ఎండలు ముదిరితే ఆర్డర్లు మరిన్ని పెరుగుతాయి. ఇప్పటికే సమ్మర్యాక్షన్ప్లాన్అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో పక్కా ప్లాన్ తో సమ్మర్లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. అవసరాన్ని బట్టి సరఫరాను కూడా పెంచాలని నిర్ణయించారు. నల్లాల ద్వారా సప్లై చేసే నీటి సమయాలను క్రమబద్ధీకరించడం, అక్రమంగా వాడే వారిపై చర్యలకు కూడా సిద్ధమయ్యారు.