
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టులో భాగంగా హైదర్ నగర్ నుంచి అల్వాల్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు షాపూర్ నగర్ వద్ద రిపేర్లు చేపట్టనున్నారు.
ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కొనసాగనున్నాయి. ఆ టైంలో షాపూర్‌నగర్, సంజయ్ గాంధీ నగర్, కళావతి నగర్, హెచ్ఎంటీ సొసైటీ, హెచ్ఏఎల్ కాలనీ, టీఎస్ఐఐసీ కాలనీ, రోడామిస్రీ నగర్, శ్రీనివాస్ నగర్, ఇందిరానగర్, గాజులరామారం, శ్రీసాయి హిల్స్, దేవేందర్ నగర్, కైలాస్ హిల్స్, బాలాజీ లేఅవుట్, కైసర్ నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.