హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో.. శనివారం (ఏప్రిల్ 12) నీళ్లు బంద్..!

హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో.. శనివారం (ఏప్రిల్ 12) నీళ్లు బంద్..!

హైదరాబాద్: గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీంలో భాగంగా రిపేర్ వర్క్ జరుగుతున్న కారణంగా ఏప్రిల్ 12న (శనివారం) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వాటర్ సప్లై బోర్డ్ ప్రకటించింది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డ్ (HMWSSB) వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదర్ నగర్ నుంచి అల్వాల్ మధ్య షాపూర్ నగర్ దగ్గర మెయిన్ పైప్ లైన్ మెయింటెనెన్స్ వర్క్ జరగనుంది. ఈ రిపేర్ వర్క్ ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జరుగుతుంది. ఈ కారణంగా సుమారు 15 గంటల పాటు శనివారం రోజు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

షాపూర్ నగర్, సంజయ్ గాంధీ నగర్, కళావతి నగర్, HAL సొసైటీ, HMT సొసైటీ, TSIIC సొసైటీ, శ్రీనివాస్ నగర్, ఇందిరా నగర్, గాజులరామారం, శ్రీ సాయి హిల్స్, దేవేందర్ నగర్, కైలాస్ హిల్స్, బాలాజీ లేఔట్, కైజర్ నగర్, గాజులరామారం విలేజ్లో తాగు నీటికి అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. అందువల్ల.. ఈ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరిపడా తాగునీటిని పట్టి ఉంచుకోవాలని అధికారులు సూచించారు.

నల్లాలకు మోటార్లను బిగించి నీటిని తోడితే రూ.5 వేల ఫైన్​ వేసి మోటర్ ​సీజ్​చేస్తామని, మూడోసారి దొరికితే కనెక్షన్​కట్ ​చేస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిటీలో భూగర్భ జలాలు అడుగంటిపోగా వాటర్​ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని ఆయన చెప్పారు. నల్లాలకు మోటార్లు బిగించడంతో ఇతర ప్రాంతాల వినియోగదారులకు లో ప్రెషర్తో నీటి సరఫరా అవుతూ ఇబ్బందులు పడుతున్నారని, వారికి తిప్పలు తప్పించడానికే తాము రంగంలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు.

Also Read:-హైదరాబాద్ చందానగర్లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్..

60 శాతం మంది నల్లాలకు మోటర్లు బిగిస్తుండడంతో హైప్రెషర్‌‌తో నల్లా నీరు సరఫరా అవుతోంది. మోటరు లేని 40 శాతం మంది వినియోగదారుల్లో 20 శాతం మందికి సాధారణంగా, మరో 20 శాతం మందికి లో–పెష్రర్‌‌తో నీరు సరఫరా అవుతుండడంతో మెట్రో కస్టమర్‌‌ సెంటర్‌‌(ఎంసీసీ)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బోర్డు థర్డ్‌‌ పార్టీ ద్వారా ఆరా తీసింది. ఇందులో ఎక్కువమంది నీటి సరఫరా టైంలో నల్లాలకు మోటర్లు బిగిస్తున్నట్లు తేలింది. సాధారణ మోటర్లతో పాటు లేటెస్ట్గా మార్కెట్‌లో వచ్చిన ఆటోమేటిక్‌‌ మోటర్లు వాడుతుండడంతో దిగువ, చివరి కనెక్షన్‌‌దారులకు అంతంత మాత్రంగానే నీటిసరఫరా అవుతోందని తెలిసింది.