పాతబస్తీలో మొరాయించిన పంపులు.. 5 గంటలు నిలిచిన నీటి సరఫరా

పాతబస్తీలో మొరాయించిన పంపులు.. 5 గంటలు నిలిచిన నీటి సరఫరా
  • రంజాన్ దృష్ట్యా యుద్ధప్రాతిపదికన రిపేర్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సాంకేతిక సమస్యల కారణంగా వాటర్​బోర్డు ఆలియాబాద్​ సెక్షన్​ రిజర్వాయర్​పరిధిలో సోమవారం ఉదయం 5 గంటలపాటు నీటి సరఫరా నిలిచింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా100 హెచ్​పీ పంపులు మొరాయించాయి. దీంతో పాతబస్తీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగింది. వాటర్​ఎండీ అశోక్​రెడ్డి ఆదేశాలతో అధికారులు వెంటనే రిపేర్లు మొదలుపెట్టారు. ఓ అండ్ ఎం, ఎలక్ట్రికల్ వింగ్ అధికారులు కలిసి కార్మికుల సాయంతో ఉదయం 11 గంటలకు వరకు రిపేర్లు పూర్తిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. 

మిస్రిగంజ్ సెక్షన్ ప్రాంతాలు షక్కర్‌‌గంజ్, రూప్‌‌లాల్ బజార్, ఫరీదియా మసీదు, షాలిబండ మెయిన్ రోడ్, లసల్‌‌దర్వాజా మూడ్, గాజీ బండ్, హమల్‌‌వాడి, కాజీపుర ప్రాంతాల్లోని దాదాపు 650 కనెక్షన్లకు నీటి సరఫరాను పునరుద్ధరించారు. వెంటనే స్పందించి రిపేర్లు పూర్తిచేసిన సిబ్బందిని ఎండీ అభినందించారు.