హైదరాబాద్ సిటీ, వెలుగు : కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్–3లోని మెయిన్ పైప్లైన్ కు రిపేర్లు కారణంగా సిటీలోని పలు ప్రాంతాలకు గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6వరకు వాటర్సప్లయ్ఉండదని వాటర్బోర్డు అధికారులు తెలిపారు. శాస్త్రీపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట, ఆళ్లబండ, జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట.
ఆటో నగర్, సరూర్ నగర్, సైనిక్ పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్, కైలాసగిరి, దేవేంద్ర నగర్, మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, గంధం గూడ, బోడుప్పల్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్ పేట ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.