
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్‌పరిధిలోని పలు ప్రాంతాలకు ఈ నెల 17న తాగునీటి సరఫరా ఉండదని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ఫేజ్–-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 ఎంఎం డయా వాల్వులు అమర్చనున్నారు. 17 ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు ఆ పనులు కొనసాగుతాయి. ఆ సమయంలో ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్, కూకట్ పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట, భరత్ నగర్, మోతీనగర్, గాయత్రినగర్
బాబానగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ, అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్ పేయినగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం, చర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా, కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్(కొన్ని ప్రాంతాలు), హఫీజ్ పేట, మియాపూర్, కొంపల్లి
గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం, ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్, ప్రజ్ఞాపూర్(గజ్వేల్), ఆలేర్(భువనగిరి), ఘన్ పూర్(మేడ్చల్/శామీర్ పేట్) ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్‌బోర్డు అధికారులు చెప్పారు.