వాటర్‌ట్యాంక్ పై నుంచి కింద పడటంతో పలువురు గాయాలపాలయిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 14న వరంగల్రైల్వేస్టేషన్లోని ఒకటో నంబర్ప్లాట్ పక్కన ఉన్న బిల్డింగ్ పై నుంచి వాటర్‌ట్యాంక్ బ్లాస్ట్అయి రేకులపై పడింది.
అవి అక్కడే ఉన్న ప్రయాణికులపై పడటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొందరు నీటి ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుపోయి రైల్వే ట్రాక్‌పై పడ్డారు. ఆ సమయంలో రైలు వచ్చింటే ఘోర ప్రమాదం జరిగేదని.. రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
క్షతగాత్రులను వరంగల్ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.