క్షణాల్లో వాటర్‌ట్యాంక్ ఎలా కూలిందో చూడండి..

క్షణాల్లో వాటర్‌ట్యాంక్ ఎలా కూలిందో చూడండి..

ఎన్నో గ్రామాలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు కడతారు. కొన్ని వేల మంది దాహార్తిని తీర్చే ఈ వాటర్ ట్యాంకులను ఎంతో పటిష్టంగా నిర్మిస్తారు. అయితే పశ్చిమ బెంగాల్‌, బంకురా జిల్లాలోని ఫేట్ దంగాలో నిర్మించిన వాటర్ ట్యాంకు మాత్రం నిర్మించిన నాలుగేళ్లలోనే కూలిపోయింది. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. ట్యాంకు నుంచి వచ్చే శబ్దాలతో అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. దాంతో అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ట్యాంకు కూలిపోయే ఘటనను స్థానికులు మొబైల్ కెమెరాలలో బంధించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2016లో ప్రారంభించిన ఈ ట్యాంకు నుంచి 15 గ్రామాల ప్రజలకు నీటి సరఫరా జరుగుతుంది. దీని సామర్థ్యం 7 లక్షల లీటర్లు. అయితే ట్యాంకు నిర్మించిన ప్రాంతంలో భూమి అంత గట్టిగా లేకపోవడం వల్లే ట్యాంకు కూలిపోయిందని అక్కడి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. అయితే ట్యాంకు నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థతో ఐదేళ్ల ఒప్పందం ఉందని, అందువల్ల ఆ సంస్థ వారే తిరిగి ట్యాంకు నిర్మిస్తారని ఓ అధికారి తెలిపారు.

For More News..

‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’

ఇంటర్ బాలుడిపై 11 మంది విద్యార్థుల లైంగిక దాడి