
మహదేవపూర్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో వేల కోట్ల సొమ్ము నీళ్ల పాలైందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరుక ఎత్తిపోసిన నీళ్లన్నీ కిందికి వదిలేస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా ఇదే రిపీట్ అవుతున్నా ఇరిగేషన్ ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నాలుగేళ్లలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. వాటర్ లిఫ్టింగ్ కోసం కరెంట్ బిల్లు నెలకు రూ. 1000 కోట్లు అవుతుందని, ఇంత ఖర్చు చేసినా ఎత్తి పోసిన వాటర్ మొత్తం మళ్లీ గోదాట్లోనే కలుస్తోందన్నారు. ఇలా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడంపై ఆఫీసర్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.