హైదరాబాద్, వెలుగు : భారీ వర్షాలతో వాటర్బోర్డు అలర్ట్ అయింది. ప్రజలకు ఇబ్బందులు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లు (ఈఆర్టీ), ఎస్పీటీ వెహికల్స్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్హోళ్లను గుర్తించి కట్టడి చేయాలని, జీహెచ్ఎంసీ గుర్తించిన 140 వాటర్లాగింగ్ పాయింట్లపై టీమ్ లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే 16 ఈఆర్టీ టీమ్లను వాటర్బోర్డు రంగంలోకి దింపింది. 24 గంటలు అందుబాటులో ఉంటాయని ఎండీ పేర్కొన్నారు.