వాటర్​బోర్డు ఎంసీసీ ఆకస్మిక తనిఖీ

వాటర్​బోర్డు ఎంసీసీ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్, వెలుగు: ప్రజల నుంచి నీటి సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించే వాటర్​బోర్డులోని మెట్రో కస్టమర్ కేర్ సెంటర్(ఎంసీసీ)ని ఎండీ అశోక్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారుల నుంచి వస్తున్న కాల్స్, స్పందనను పరిశీలించారు. కొందరు ఫిర్యాదుదారులతో ఎండీ అశోక్ రెడ్డి స్వయంగా మాట్లాడారు. కాల్ రికార్డింగ్స్ విన్నారు. సీవరేజ్​ఓవర్ ఫ్లో, రోడ్డుపై సిల్ట్, మ్యాన్ హోల్స్, నో వాటర్, లో ప్రెజర్ ఫిర్యాదులు ఎక్కువగా  వచ్చాయని అధికారులు తెలిపారు.

సమస్య పరిష్కారమైన తర్వాత వినియోగదారులకు కచ్చితంగా సమాచారం అందించాలని అశోక్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలలో ఇప్పటివరకు 5,514 మంది నుంచి ఫీడ్ బ్యాక్ కాల్స్ తీసుకోగా, 3 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. 14 శాతం మంది సమస్యను పరిష్కరించకుండానే సమస్య పరిష్కారమైనట్లు చెబుతున్నారని, క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు పర్యటించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఎండీ వెంట ఐటీ సీజీఎం టీవీ శ్రీధర్, ఐటీ సెల్ అధికారులు పాల్గొన్నారు.