మానుకోట జిల్లాలోని జలపాతాలు మనసును తాకుతున్నాయి. గూడూరు, బయ్యారం, గంగారం మండలాల్లోని వాటర్ఫాల్స్ఇటీవల కురిసిన వర్షాలకు పై నుంచి జాలువారుతున్న జలాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భీమునిపాదం, చింతోని గుంపు, పెద్దగుట్ట వాటర్ ఫాల్స్, గంగారం మండలం ఏడు బావుల ప్రదేశం, బయ్యారం చెరువు వర్షం నీటితో మత్తడి దుంకుతాయి. కానీ, ఈ వాటర్‌ఫాల్స్‌కు వెళ్లేందుకు రోడ్డు లేకపోవడం ఇబ్బందిగా మారింది.
భీముని వాటర్ ఫాల్ కు చేరుకోవడానికి బీటీ రోడ్డు నుంచి 200 మీటర్లకు పైగా కాలినడకన వెళ్లాల్సిందే. పెద్దగుట్ట వాటర్ ఫాల్‌కు 2 కిలోమీటర్ల మేర డొంక దారి, చింతోనిగుంపు వాటర్ ఫాల్‌కు చేరాలంటే అర కిలోమీటర్ నడువాల్సిందే. ఇక ఏడు బావుల వాటర్ ఫాల్ కు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు నడక తప్పడం లేదు. రోడ్లు వేస్తే ప్రజలు ఎక్కువగా వస్తారని టూరిస్ట్‌లు చెబుతున్నారు. – మహబూబాబాద్, వెలుగు