న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో యోగా గురు స్వామి రామ్ దేవ్ బాబా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో యూఎస్ లోని ప్రతిష్ఠాత్మకమైన మ్యూజియంలో కనిపించిన మొదటి సాధువు బాబా రామ్ దేవ్ అవుతారు.
ఈ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసేముందుకు మంగళవారం (జనవరి 30) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గురు రామ్ దేవ్ బాబా ఆవిష్కరించారు. సేమ్ టు సేమ్ ఉన్న ఆ మైనపు విగ్రహానికి తిలకం దిద్దారు రామ్ దేవ్ బాబా.
ప్రపంచవ్యాప్తంగా మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహాలు ప్రదర్శించిన ప్రముఖుల జాబితా
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- మేడమ్ టుస్సాడ్ మ్యూజియం లండన్
- ఐశ్చర్యారాయ్ బచ్చన్ - మేడ్ టుస్సాడ్స్ మ్యూజియం న్యూయార్క్
- సల్మాన్ ఖాన్ - మేడమ్ టుస్సాడ్ మ్యూజియం, న్యూయార్క్
- అమితాబ్ బచ్చన్ - మేడమ్ టుస్సాడ్ మ్యూజియం, లండన్, హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూఢిల్లీ
- షారూఖ్ ఖాన్ - మేడమ్ టుస్సాడ్ , లండన్
- సచిన్ టెండూల్కర్- మేడమ్ టుస్సాడ్ ,లండన్
#WATCH | Wax figure of Yog Guru Ramdev unveiled at an event of ‘Madame Tussauds New York’ in Delhi. pic.twitter.com/xFmsUyKWHm
— ANI (@ANI) January 30, 2024