వయనాడ్: వయనాడ్ ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రియాంక గాంధీ రికార్డు మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ పేరిట నమోదైన మెజారిటీ రికార్డును ప్రియాంక బద్ధలు కొట్టారు. శనివారం(నవంబర్ 23, 2024) మధ్యాహ్నం 1:23 సమయానికి వయనాడ్లో ప్రియాంక గాంధీ మెజారిటీ 3 లక్షల 77 వేల 517 ఓట్లు దాటింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీకి వయనాడ్లో 3,64,422 ఓట్ల మెజారిటీ దక్కింది. ఈ రికార్డును బద్ధలు కొట్టి అన్న మెజారిటీ రికార్డును తిరగరాసిన చెల్లిగా ప్రియాంక గాంధీ నిలిచింది. అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి వయనాడ్లో ప్రియాంక గాంధీకి 4 లక్షల మెజారిటీ దక్కొచ్చనే అంచనాలున్నాయి.
Also Read :- మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ వయనాడ్తో పాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏదో ఒక సీటును ఆయన వదులుకోవాల్సి రావడంతో వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేశారు.