కేరళ రాష్ట్రం వయనాడ్ నియోజకవర్గం పరిధిలోని మెప్పాడి, మండక్కై, చూరల్ మాల ప్రాంతాలు అన్నీ కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం.. 2024, జూలై 30 తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కుండపోత వర్షం పడింది.. ఇది క్లౌడ్ బరస్ట్ అని చెప్పాలి.. గంటపాటు ఆగకుండా.. కుండపోత వర్షం పడటంతో కొండ ప్రాంతాల్లోని నీళ్లు, మట్టి ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చింది.
Also Read:-వయోనాడ్ విషాదంపై స్పందించిన ప్రధాని మోదీ, రాహుల్
అత్తమాల, నూల్ పుజా, మండక్కై, మెప్పాడి గ్రామాల్లోని ఇళ్లపై పడింది. అత్యంత వేగంగా వచ్చిన బురదతో కూడిన నీళ్లు ఇళ్లను తుడిచిపెట్టేసింది. ఈ నాలుగు గ్రామాల్లోని సగం ఊర్లు కొట్టుకుపోయాయి.. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా బురదతో నిండిపోయింది. ఇప్పటి వరకు 42 మంది చనిపోగా.. 70 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 250 మంది గల్లంతు అయ్యారు. వీరు బురదలో కూరుకుపోయారా లేక నీళ్లల్లో కొట్టుకుపోయారా అనేది ఇప్పటికీ తెలియటం లేదు..
కేరళ రాష్ట్ర డిజాస్టర్ టీమ్స్, NDRFతో భారత సైన్యం రంగంలోకి దిగింది. రెండు యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లతోపాటు 250 మంది జవాన్లు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం వయనాడ్ ప్రాంతంలో వర్షం పడుతుంది.. మరో వైపు కొండల నుంచి బురద, నీళ్లు వస్తున్నాయి.. కొన్ని మీటర్ల ఎత్తున గ్రామాల్లో బురద మేటలు వేసింది.. దీన్ని తొలగించటం ఇప్పట్లో సాధ్యం కాదు. దీంతో పోలీస్ కుక్కలు, ఇతర టెక్నాలజీ సాయంతో బురదలో కూరుకుపోయిన వాళ్లను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.