మీరు గ్రేట్: జియో, ఎయిర్ టెల్ మానవత్వం చూస్తే మీకు కన్నీళ్లు వస్తాయి..

మీరు గ్రేట్: జియో, ఎయిర్ టెల్ మానవత్వం చూస్తే మీకు కన్నీళ్లు వస్తాయి..

ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకారణంగా కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. కొండచరియలు కింద పడి నాలుగు గ్రామాలు పూర్తిగా నేలమట్ట మయ్యాయి. 285 మంది స్థానికులు చనిపోయారు. 200 మందికి పైగా  గాయపడ్డారు. మరో 240 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. వర్ష ప్రభావిత ప్రాంతాలైన ముండక్కై, చూరాల్ మాల ప్రాంతాల్లో ఆర్మీ, రెస్క్యూ టీంలు సహాయక చర్యలు  చేపట్టారు. దాదాపు వెయ్యి మంది ప్రజలను కాపాడారు. 

రెస్క్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎడతెరిపి లేని  వర్షాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. ఇలాంటి భయంకరమైన విపత్తును అబ్జర్వ్ చేస్తున్న దేశంలోని పెద్ద టెలికం కంపెనీలు జియో, ఎయిర్ టెల్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో  తమ కస్టమర్లకు రిలీఫ్ కొన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాయి. నెట్ వర్క్ ల వినియోగంలో కస్టమర్లకు కొంతవరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాయి.. పూర్తి వివరాలేంటో చూద్దాం. 

వయనాడ్ లో ఎయిర్ టెల్ సహాయ చర్యలు.. 

వయనాడ్ లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎయిర్ టెల్ నెట్ వర్క్ ను వినియోగించే కస్టమర్లకు ఉచితంగా  సేవలు అందించాలని నిర్ణయించింది. రోజు 1జీబీ టేడా, 100 ఎస్ ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాల్స్ ను ఉచితంగా మూడు రోజుల పాటు అందించాలని నిర్ణయించింది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో వయనాడ్ లో ప్రీపెయిడ్ మొబైల్ సర్వీస్ ఎక్స్ పెయిర్ అయిపోయిన వారికి ఈ ఉచిత మొబైల్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. పోస్ట పెయిడ్ కస్టమర్లకోసం బిల్ డ్యూ డేట్ ను మరో 30 రోజులకు పొడిగించింది.

వాయనాడ్ లో జియో సహాయక చర్యలు

కొనసాగుతున్న సహాయక చర్యల ఫలితంగా నెట్ వర్క్ ట్రాఫిక్‌ను నిర్వహించడానికి జియో తన నెట్‌వర్క్ మరింత బలోపేతం చేసింది. జియో టెలికాం ఆపరేటర్ ఈ ప్రాంతంలో అంతరాయం లేని సేవలను అందించడానికి రెండో ప్రత్యేక టవర్‌ను ఇన్‌స్టాల్ చేసింది. నెట్‌వర్క్  విస్తరణ పౌరులకు, అధికారులకు ఆటంకంలేని కమ్యూనికేషన్‌ని అందిస్తుంది. అయితే కస్టమర్ల కోసం జియో ఎలాంటి డేటా, కాలింగ్ లేదా సర్వీస్ చెల్లుబాటు ప్రయోజనాలను ప్రకటించలేదు.