కేరళ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ఇష్యూపై రాద్దాంతం నడుస్తుంది. వయనాడ్ విలయానికి.. వయనాడ్ బాధితులకు అండగా ఉండేందుకు.. ప్రభుత్వ ఉద్యోగులు తమ 5 రోజుల జీతాన్ని స్వచ్ఛంధంగా ఇవ్వాలనే పిలుపు ఇచ్చింది ప్రభుత్వం. దీని వల్ల 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయని అంచనా వేయగా.. ఊహించని విధంగా.. అనూహ్యంగా.. సగం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ముందుకు వచ్చారు. కేవలం 52 శాతం మంది ఉద్యోగులు మాత్రమే 5 రోజుల జీతాన్ని ఇవ్వటానికి అంగీకరించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులపై సోషల్ మీడియాపై భిన్న వాదనలు నడుస్తున్నాయి.
Also Read:-పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయా
వయోనాడ్ లో కొండచరియలు విరిగిపడి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.. దాదాపు 300 మంది ప్రాణాలు కూడా కూల్పోయారు.భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వయోనాడ్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహాయనిధిని ఏర్పాటు చేసింది. ఇందు కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఐదు రోజుల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డబ్బులు ఇవ్వాలనుకునే ఉద్యోగులు ఒక అంగీకార పత్రం రాసి ఇవ్వాలి. మూడు ఇన్ స్టాల్ మెంట్లలో డబ్బును తీసుకుంటారు.. ఎక్కువ ఇవ్వాలనుకుంటే పది ఇన్ స్టాల్ మెంట్లలో డబ్బును తీసుకుంటారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం 5,32,207 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్లంతా ఐదు రోజుల తమ జీతాలను విరాళాలుగా ఇస్తే రూ. 500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే దాదాపు సగం మంది 48 శాతం ఉద్యోగులు తమ జీతాలను డొనేట్ చేయడానికి ముందుకు రాలేదు. 52 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ జీతాలను విరాళాలుగా ఇవ్వడానికి ముందుకొచ్చారు.
ఉద్యోగులు తమ జీతాలను విరాళాలుగా ఇస్తున్నట్లు సెప్టెంబర్ 5 వరకు అంగీకార పత్రం ఇవ్వాలి. కానీ సగం ఉద్యోగులు మాత్రమే ఇచ్చారు. అయితే విరాళాలు ఇవ్వని ఉద్యోగులను బలవంతంగా డబ్బులు వసూలు చేయొద్దని ప్రభుత్వం సూచించింది.