Good Health: ఉద్యోగులూ మీ కోసమే.. టెన్షన్ ను ఇలా చిత్తు చేద్దాం.. హెల్త్ కోసం ఇవి తినండి..!

Good Health: ఉద్యోగులూ మీ కోసమే.. టెన్షన్ ను ఇలా చిత్తు చేద్దాం.. హెల్త్ కోసం ఇవి తినండి..!

బడి పిలగాళ్లకు పరీక్షలంటే భయం.. ఉద్యోగం చేసేటోళ్లకు బాస్ అరుస్తరనో, పని లేటైతదనో భయం.. ఉద్యోగం కోసం చూసేటోళ్లకు ఏ జాబ్ రాకపోతే భవిష్యత్ ఏమైతదో అనే భయం.. మామూలు మాటల్లో చెప్పుకుంటే భయం.. కానీ.. అది భయం కాదు.. 'ఒత్తిడి'. ఆరోగ్యాన్ని చిత్తు చేసే ఓ మహమ్మారి. మరి దాన్ని చిత్తు చేసేందుకు ఏం చేద్దాం?

స్టూడెంట్ల కోసం..

పరీక్షలు ప్రతీ సంవత్సరం వస్తాయి. కానీ. ఆరోగ్యం ఒక్కసారి పోతే మళ్లీ రాదు. అందుకే టెన్షన్ పడకుండా.. మెదడు మీద ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడాలి. రానీ సమాధానాలు నేర్చుకోవడానికి సమయం కేటాయించి మెదకు మీద ఒత్తిడి పెంచడం కంటే వచ్చిన వాటిని పర్ ఫెక్ట్‎గా ఎలా రాయాలో ప్లాన్ చేసుకోవాలి. కాస్త కష్టంగా అనిపించిన సబ్జెకు ఇంకొంచెం ఎక్కువ సమయం కేటాయించి ప్రశాంతంగా చదువుకోవాలి. చదువుతున్నప్పుడు ఏదైనా సందేహం వస్తే టీచర్‎నో, ఇంట్లో పెద్దవాళ్లను అడిగి తెలుసుకోవాలి. అంతేకానీ.. 'పలానా' ఆన్సర్ రావట్లేదు అని టెన్షన్ పడితే ఏం ఉపయోగం ఉండదు. పైగా మెదడు ఒత్తిడికి గుర్రె ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయే అవకాశం ఉంది.

ఉద్యోగులూ ఇది మీకే..

ఆఫీసు పనంటే.. ప్రతిరోజూ చేసేదే. అందుకోసం అనవసరంగా టెన్షన్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వర్క్ ప్లాన్ చేసుకుంటే ఎంత ప్రాజెక్ట్ అయిన పూర్తి చేసేయొచ్చు. ఒకవేళ మీ" ప్రాజెక్ట్లలో ఇతర కొలీగ్స్ కూడా ఉంటే అందరితో మాట్లాడే వర్క్ డివైడ్ చేసుకుంటే సరి. కాకపోతే.. ఇందరిని కో-ఆర్డినేట్ చేసుకుంటే ఇన్స్ట్రమ్..కాదు గదా.. అంతకంటే ముందే ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. ఏదైనా సరే ఆలోచించి చేస్తేనే.. తొందరగా పూర్తవుతుంది. టెన్షన్‎గా చేస్తే.. పని చెడిపోవడంతో పాటు అనవసర ఒత్తిడి.

జాబ్ వస్తదిలే

ఉద్యోగం- కోసం పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురుచూసే వాళ్లు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఒక్కటి కాకపోతే.. మరో ఉద్యోగం వస్తుంది. అంతేకానీ, ఒత్తిడితో చిత్తయిపోతే ఉద్యోగం రాదు కదా! అంతేకాదు.. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పు డు ఆ ఉద్యోగం వస్తే.. మీ పరిస్థితి ఏంటి? ప్రయ త్నాలు చేస్తూనే ఉండాలి. ఫలితం వచ్చేటప్పుడు వస్తది. ఒకటి మనకు అందలేదంటే అంతకంటే మంచిది ఇంకేదో మనకోసం రెడీగా ఉందని పాజిటివ్ ఆలోచించాలి అంతేగానీ.. టెన్షన్ పడిపోయి ఒత్తిడితో ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఎందుకు?

ALSO READ | Health tips: రోజూ 30 నిమిషాల వాకింగ్తో ఎంతో ఆరోగ్యం..ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే 6మార్గాలు

పరిష్కారం ఉందిగా..

చాలామంది రకరకాల సమస్యలతో సతమత మపుతూ ఉంటారు. సమస్యలనేవి ఈ భూమ్మీద పుట్టిన ప్రతిజీవికి ఉంటాయి. అసలు సమస్యలు లేని మనిషే ఈ భూమ్మీద ఉండడు. అలాగే.. పరిష్కారం లేని సమస్యలు కూడా ఉండవు. మనం పరిష్కరించుకునే పద్ధతిని భట్టి ఆ సమస్య చిన్నగానో పెద్దగానో కనిపిస్తది అంతే. ఓపికగా ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఒత్తిడి దరిచేరదు.

ఇవి పాటించండి:

ధ్యానం: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభించే ఏకైక మార్గం ధ్యానం. ఆరోగ్యం మీద, ఆలోచనా తీరు మీద ధ్యానం చాలా ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో అన్నింటికంటే ముందుంటుంది. పది నిమిషాలు ధ్యానం చేస్తే రోజంతా హాయిగా ఉండొచ్చు. 

నవ్వు: నవ్వు నలభై విధాల గ్రేటు అన్నారు పెద్దలు. అవును మరి ప్రశాంతంగా నవ్వితే శరీర కండరాలన్నీ రిలీఫ్ అవుతాయి. చికాకులన్నీ తొలగిపోతాయి. సమస్యలకు నవ్వంటే ఇష్టం ఉండదు. అందుకే నవ్వుతూ ఉండేవారి దగ్గరకు అవి రావు. హాయిగా నవ్వుతూ ఉందండి.. మీ మెదడు చురుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.. 

నడక: శరీరాన్ని మాత్రమే కాదు.. మనసును కూడా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి తీసుకెళ్లేది ఏదైనా ఉన్నదంటే అది నడక అని చెప్పవచ్చు. బాగా ఒత్తిడిగా ఫీలైనప్పుడు మనసు బాగలేనప్పుడు నాలుగు అడుగులు ఇలా వేసి చూడండి ఎంత రిలాక్స్ అనిపిస్తుందో మీకె తెలుస్తుంది.

మ్యూజిక్: సంగీతానికి మూగజీవాలు కూడా స్పందిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఒత్తిడిగా ఉన్నప్పుడు, టెన్షన్  ఉన్నప్పుడు మనసుకు నచ్చిన పాటనో, సంగీతాన్నో వినండి. మీకు సంగీతంలో ప్రవేశం ఉంటే మీకు వచ్చిన సంగీత వాయిద్యాన్ని వాయించండి. రిలీఫ్ అవుతారు.

ఇవి తినండి..

కమలాపండు: విటమిన్-సి ఇందులోపు ష్కలంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించి రక్తసరఫరా సవ్యంగా జరిగేలా చేస్తుంది. ఒత్తిడి వలన రక్తసరఫరాలో వచ్చే మార్పులను నియంత్రిస్తుంది. 
 

పాలు: ఏపనీ తోచనప్పుడు కుప్పు కాఫీయో, టీయో తాగితే కాస్త ఉపశమనం బభిస్తుంది. అది కాఫీ మహిమ మాత్రమే కాదు పాలలోని గొప్పదనం కూడా. పాలలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత వేరూరుతుంది.

బాదం: ఇవి శరీరంలో సెరటోనిన్లను ఉత్పత్తి చేయడానికి సాయపడుతాయి. ఒత్తిడికి కారణమయ్యే ఆలోచనా విధావాన్ని మార్చడంలో బాదం ఫస్ట్ ప్లేస్లోఉంటుంది.

చేపలు: వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుఉంటాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ స్థాయిని తగ్గిస్తాయి. ఒత్తిడికి చెక్ పెట్టేందుకు కనీసం వారంలో ఒక్కసారైనా
చేపలు తినాలి.

సువాసన వాసనను బట్టి కూడా మనిషి మూడ్ మారుతుంది. ఎవరైనా పక్కన నిల్చున్నప్పుడు వారి నుంచి దుర్వాసన వస్తే మనం భరించలేం. వెంటనే ముఖం చిట్లించుకుంటాం. అదే.. మంచి వాసన వస్తే  కాసేపు ఆగి మరీ పీల్చుకుం టాం. ఆలోచనలను, మనసును తేలికపరచే శక్తి సువాసనకు ఉంది. అందుకే. ఒత్తిడిగా అనిపిం చినప్పుడు ఏదైనా సువాసనను పీల్చండి.