పని ఒత్తిడి, నిద్ర లేకపోవడం లాంటి కారణాల వల్ల తరచూ తల నొప్పి వస్తుంటుంది కొందరికి. అలాంటివాళ్లు మెడిసిన్ పై ఆధారపడకుండా ఈ చిట్కాలు పాటిస్తే తలనొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది.
- " ఐస్ ప్యాకు కర్చీఫ్ లేదా టవల్తో చుట్టి నుదురు. మాడు. మెడ చుట్టూ పెడితే తలనొప్పి తగ్గుతుంది.
- " పిడికెడు బియ్యాన్ని గుడ్డలో చుట్టి పాన్పైన వేడి చేయాలి. ఆ గుడ్డతో తల చుట్టూ అడుముకోవాలి.
- నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ వాసన పీల్చుకొని కూడా తలనొప్పి తగ్గేలా చూసుకోవచ్చు. ఇది అరోమా థెరపిలాగ ఉపయోగపడుతుంది.
- జుట్టుకు రాసే నూనెని, గోరువెచ్చ చేసి, రాసుకుని, మసాజ్ చేసినా ఫలితం ఉంటుంది.
- అప్పుడప్పుడు డీ హైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకని ఎక్కువ నీళ్లు తాగడం, కొబ్బరి నీళ్లు లేదా ఎలక్ట్రోలైట్స్ ఉండే డ్రింక్స్ తాగడం మంచిది.
- ఆ పని ఒత్తిడి వల్ల తలనొప్పి వస్తుంది అనుకుంటే.. కొద్ది సేపు గట్టిగా గాలి పీల్చుతూ, వదలాలి.
ALSO READ:జీవో నెంబర్ 46 రద్దు చేయండి.. ప్రభుత్వానికి కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్