క్రిప్టో ఎక్చేంజ్ యాప్ లో వేల కోట్లు హ్యాక్.. ట్రేడింగ్ నిలిపివేత

క్రిప్టో ఎక్చేంజ్ యాప్ లో వేల కోట్లు హ్యాక్.. ట్రేడింగ్ నిలిపివేత

ఇండియన్ క్రిప్టో లావాదేవీలు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్ అయిన వాజిర్ ఎక్స్ హ్యాక్ అయ్యింది. అక్షరాల 230 మిలియన్ డాలర్లను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు.. దీంతో యాప్ లో లావాదేవీలను నిలిపివేసింది కంపెనీ. ఉత్తర కొరియా నుంచి ఈ హ్యాక్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చిన కంపెనీ.. వాజిర్ ఎక్స్ ను తిరిగి తమ చేతుల్లోకి తీసుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తుంది. హ్యాక్ చేసిన 230 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని ఇతర మార్గాల్లో తరలిస్తున్నట్లు గుర్తించామని.. వాటిని అడ్డుకుంటున్నామని వెల్లడించింది కంపెనీ.

జూలై 18  న  కొన్ని గంటల్లోనే  వాజిర్ ఎక్స్ యాప్ హ్యక్ కు  గురైంది. దీంతో  కస్టమర్ల  లావాదేవీలకు  తీవ్ర ఇబ్బంది ఎదురయ్యింది.  WazirX హ్యాక్ అయినట్లు  ట్విటర్‌లో X లో  ధృవీకరించింది. వాజిర్ ఎక్స్  భారత్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని లావాదేవీలు జరుపుతోంది.   ఇది దేశంలోని కొన్ని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) రిజిస్టర్డ్ ఎక్స్ఛేంజీలలో ఒకటి.  భారత పౌరులకు క్రిప్టో ఎక్స్ఛేంజ్ సేవలను అందించడానికి ఉపయోగపడుతుంది.

వాజిర్ ఎక్స్ హ్యాక్ అయినట్లు మా దృష్టికి వచ్చింది.  మా బృందం ఈ  సమస్యను  పరిశీలిస్తోంది. మీ ఆస్తుల భద్రతను  దృష్టిలో ఉంచుకుని యాప్ లో క్రిప్టో లావాదేవీలు నిలిపివేస్తున్నాం. దీనికి వినియోగదారులందరూ సహకరించాలి.  ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు  సమాచారాన్ని మీకు తెలియజేస్తాం అని కంపెనీ తన ఎక్స్ లో తెలిపింది.