ఇప్పటివరకూ సిక్సర్లంటే పురుషుల క్రికెటే. అందునా.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మిస్టర్ 360 ఏబి డివిలియర్స్, ఆండ్రూ రస్సెల్ వంటి వారే అలవోకగా సిక్సర్లు బాదగలరు. తాజాగా ఆ జాబితాలోకి ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ 'గ్రేస్ హారిస్' కూడా చేరిపోయింది. ఈ మహిళా క్రికెటర్ కొట్టిన సిక్సర్లకు బ్యాట్ కూడా తట్టుకోలేకపోయిందంటే నమ్మండి. దెబ్బకు బ్యాట్ రెండు ముక్కలైంది.
Also Read : IND vs NZ: కివీస్‍కు సవాల్ విసురుతున్న భారత పేసర్లు.. 2 వికెట్లు డౌన్
మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో భాగంగా ఆదివారం పెర్త్ స్కార్చర్స్ ఉమెన్, బ్రిస్బేన్ హీట్ ఉమెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 229 పరుగులు భారీ స్కోర్ చేసింది. బ్రిస్బేన్ ఓపెనర్ గ్రేస్ హారిస్ వీరవిహారం చేసింది. 59 బంతుల్లో 12 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసింది.
The Grace Harris Show ☄️#WBBL09 #BringTheHEAT pic.twitter.com/M6KhL7bG8U
— Brisbane Heat (@HeatBBL) October 22, 2023
గ్రేస్ ధాటికి పెర్త్ స్కార్చర్స్ బౌలర్లు ప్రేక్షుకులుగా మారిపోయారు. అంతేకాదు, ఒక బంతిని కొట్టే సమయంలో గ్రేస్ బ్యాట్ రెండు ముక్కలవ్వగా.. బంతి మాత్రం స్టాండ్స్‌లోకి వెళ్లిపోయింది. అంత అలవోకగా ఈ మహిళా క్రికెటర్ సిక్సర్లు బాధేస్తోంది. ఈ ఇన్నింగ్స్ చూశాక ఈమెను అందరూ గేల్ శిష్యురాలు అని పోగుడుతున్నారు.
A broken bat? Not a problem for Grace Harris who still smashed the ball for a six ? #WBBL09
— ESPNcricinfo (@ESPNcricinfo) October 22, 2023
(? via @7cricket) pic.twitter.com/zsAX9VGqWe
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 229 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో పెర్త్ స్కార్చర్స్ 179 పరుగులకే పరిమితమైంది.