అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిరకాల ప్రత్యర్థులు (ఇండియా - పాకిస్థాన్) పోరుకు సమయం ఆసన్నమైంది. శనివారం (అక్టోబర్ 14న) అహ్మదాబాద్ గడ్డపై దాయాది జట్లు అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకూ ఈ టోర్నీలో ఇరు జట్లు రెండేసి విజయాలతో సమంగా ఉండగా.. మూడో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నదే లెక్క. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉండగా.. పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
గెలిచిన జట్టుతోనే పాక్
దాయాది పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. గత మ్యాచ్‌లో అందరి ప్రదర్శన బాగుంది కనుక దాదాపు అదే జట్టును కొనసాగించవచ్చు. కెప్టెన్ బాబర్ ఆజాం, మహమ్మద్ రిజ్వాన్‌లను త్వరగా ఔట్ చేస్తే.. మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు.
అశ్విన్ పక్కా.. మరి గిల్..?
ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్ఘనిస్తాన్‌తో మ్యాచ్ లో బెంచ్ కు పరిమితమైన అశ్విన్.. తుది జట్టులో ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే, డెంగ్యూ నుంచు కోలుకున్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కు కూడా తుది జట్టులో స్థానం దక్కొచ్చు. అదే జరిగితే, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ తప్పుకోవాల్సి ఉంటుంది.
Rohit Sharma confirms Shubman Gill is 99% available for the match against Pakistan tomorrow. pic.twitter.com/nC235pz31K
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 13, 2023
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా,రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది, హరీస్ రౌఫ్.