క్రికెట్‌లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. అభిమానులకు ఉత్కంఠను పంచేదే. ఓడటానికి ఏ జట్టు అంగీకరించదు. విజయం కోసం ఇరు జట్లు చివరి నిమిషం వరకూ పోరాడతాయి. అభిమానులు సైతం ఆఖరి బంతి వరకు ఆటను ఆస్వాదిస్తారు. అలాంటి మెగా సమరానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. అక్టోబర్ 14న(శనివారం) అహ్మదాబాద్ వేదికగా దాయాదుల సమరం జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు కలిగించే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి.
తేలికపాటి జల్లులు కురిసే అవకాశం
వాతావరణ నివేదికల ప్రకారం.. శనివారం అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. అయితే, మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అహ్మదాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉష్ణోగ్రతలు 30-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చని వెల్లడించింది.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది, హరీస్ రౌఫ్.