వన్డే ప్రపంచ కప్‌లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో ఇరు జట్లు అహ్మదాబాద్ గడ్డపై అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది. టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు ఏ ఛానెల్‌లో చూడవచ్చు. లేదా ఉచితంగా మొబైల్‌లో ఏ యాప్‌లో చూడవచ్చన్న వివరాలు తెలుసుకుందాం..
ఎప్పుడు, ఎక్కడ..?
అక్టోబర్ 14న శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 1:30 గంటలకు టాస్ వేయనున్నారు.
ప్రత్యక్ష ప్రసారాలు
మీరు ఇంట్లో కూర్చొని టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ను ఎంచుకోండి. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ మరాఠీ, అనేక ఇతర స్టార్ స్పోర్ట్స్‌తో సహా ఇతర భాషల ఛానళ్లలో చూడవచ్చు. అలాగే, డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉచితంగా లైవ్ చూడవచ్చు.
డిస్నీ + హాట్‌స్టార్ ఉచితం
ఆఫీస్‌లో కూర్చొని హాయిగా మొబైల్ లో చూడాలనుకునే అభిమానులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో మ్యాచ్‌ను ఉచితంగా చూడవచ్చు. అదే స్మార్ట్ టీవీ, డెస్క్ టాప్, ల్యాప్‌టాప్‌ల్లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.