IND vs PAK: ఫైనల్‌కు వేళాయే.. ఇండియా - పాకిస్తాన్ మధ్య తుది పోరు

IND vs PAK: ఫైనల్‌కు వేళాయే.. ఇండియా - పాకిస్తాన్ మధ్య తుది పోరు

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. శనివారం (జూలై 13) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే ఈ తుది పోరు శనివారం రాత్రి 9:30 గంటలకు పారంభం కానుంది.

ఆసీస్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు

తొలి సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్.. వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను ఓడించి  ఫైనల్‌ల్లో అడుగుపెట్టింది. దాయాది జట్టు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్.. ఆస్ట్రేలియాని మట్టి కరిపించి ఫైనల్ చేరింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండీ చాంప్స్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ALSO READ | జూలై 19న ఇండో-పాక్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌.. ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు ఫ్రీ ఎంట్రీ

మొదట యువీ సేన 254 పరుగుల భారీ స్కోర్ చేయగా.. కంగారూల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప(65), యువరాజ్ సింగ్ (59), యూసుఫ్ పఠాన్(51), ఇర్ఫాన్ పఠాన్(50)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఛేదనలో బ్రెట్ లీ సేన కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.

రాత్రి 9:30 గంటలకు మ్యాచ్

భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే ఫైనల్ పోరు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం, శనివారం రాత్రి 9:30 గంటలకు పారంభం కానుంది. 

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు 

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇక డిజిటిల్‌గా ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఆస్వాదించవచ్చు.