బూస్టర్ డోసుకు అనుమతివ్వండి

బూస్టర్ డోసుకు అనుమతివ్వండి

ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి కొనసాగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. హోం ఐసోలేసన్ ప్రోగ్రామ్ ను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ నెల 23న రివ్యూ మీటింగ్ కు ప్లాన్ చేశామన్నారు. కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ వేరియంట్ మునుపటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పినప్పటికీ.. దాని లక్షణాలు తేలికపాటివన్నారు. ప్రజలు భయపడవద్దని కోరారు. ఢిల్లీలో ఇప్పటివరకు 24 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని.. వీరిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు.

 

మరిన్ని వార్తల కోసం

12మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందే

లోక్ సభలో ఆధార్‌‌తో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లు