![మనం AI యుగంలోకి వచ్చేశాం.. అద్భుత ఆవిష్కరణలు చేద్దాం : పీఎం మోదీ](https://static.v6velugu.com/uploads/2025/02/we-are-at-dawn-of-ai-age-need-to-skill-re-skill-says-pm-modi-at-ai-paris-summit_QxutT3yPpa.jpg)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ పీఎం నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం AI యుగంలోకి వచ్చేశాం.. అద్భుత ఆవిష్కరణలు చేద్దామని పిలుపునిచ్చారు. పారిస్ లో జరుగుతున్న ఏఐ సమ్మిట్ (AI Action Summit )లో ప్రసంగించిన మోదీ ఏఐ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఏఐ సమ్మిట్ లో మోదీ చేసిన కీలక ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
ఏఐ తో ప్యూచర్ బాగుంటుంది అనే విశ్వాసాన్ని కల్పించేందుకు ఇండియా తన అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉంది.
అతి తక్కువ ఖర్చుతో 140 కోట్ల ప్రజల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను ఇండియా నిర్మించింది. ఎకానమీ, పాలన తదితర అంశాలలో సంస్కరణలు, కొత్త విధానాలు కోసం కొత్త నిబంధనలు, అప్లికేషన్ల ద్వారా ప్రజా జీవితంలో మార్పు తీసుకొచ్చాం.
ఏఐ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అంతే వేగంగా ప్రపంచం అడాప్ట్ చేసుకుంటోంది. ఇటువంటి టెక్నాలజీ విషయంలో సమ్మిళిత అభివృద్ధి, పాలన కోసం ఈ రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లను గుర్తించి విశ్వాసాన్ని నిలబెట్టాలి. అందుకోసం ప్రపంచ దేశాలు సహరించుకోవాలి.
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, డెవలప్ చేయడంలో, ప్రైవసీ విషయంలో ఇండియా ముందంజలో ఉంది. ప్రజా శ్రేయస్సు కోసం ఏఐ అప్లికేషన్లను (AI apps) తయారు చేస్తున్నాం.
టెక్నాలజీని ప్రజాస్వామ్యం చేసి, ప్రజా కేంద్రక యాప్స్ ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. భద్రత, తప్పుడు సమాచారం, తప్పడు ప్రచారం (deepfakes) తదితర సవాళ్లపై చర్యలు తీసుకోవాలి.
ఏఐ తో జాబ్స్ పోతాయని భయపడుతున్నారు.. కానీ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు జాబ్స్ ఎక్కడికి పోవు.. వాటి స్వరూపం మారుతుంది.. కొత్త రకమైన జాబ్ లు వస్తాయని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది.
మనం AI యుగంలో ప్రారంభ దశలో.. మానవ జాతి దిశను నిర్దేశించే దశలో ఉన్నాం ఉన్నాం.. టెక్నాలజీ యుగంలో మానవీయతను పెంచే విధంగా కృషి చేయాలి.