రోజుకి 1.35 కోట్ల ఫ్రాడ్‌‌ కాల్స్‌‌.. బ్లాక్‌‌ చేసి రూ.2,500 కోట్ల కాపాడాం

రోజుకి 1.35 కోట్ల  ఫ్రాడ్‌‌ కాల్స్‌‌.. బ్లాక్‌‌ చేసి రూ.2,500 కోట్ల కాపాడాం
  • రూ.2,500 కోట్ల ప్రజల ఆస్తులను కాపాడాం
  • వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దేశమంతటా బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4జీ, మే నుంచి  5జీ పై దృష్టి 

న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన టెక్నికల్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో   రోజుకి 1.35 కోట్ల ఫ్రాడ్ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్లాక్ చేయగలుగుతున్నామని, ఇప్పటివరకు సుమారు రూ.2,500 కోట్ల విలువైన ప్రజల ఆస్తులను కాపాడామని యూనియన్ కమ్యూనికేషన్స్ మినిస్టర్  జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఇండియా వెలుపల సర్వర్ల నుంచి ఎక్కువగా స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్ వస్తున్నాయని, టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీటిని బ్లాక్ చేయగలుగుతోందని పేర్కొన్నారు. సంచార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాథీ, చక్షు ద్వారా  డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూకేషన్ (డాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్  నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రూ.2,500 కోట్ల విలువైన ప్రజల ఆస్తులను రక్షించిందని వివరించారు. ఈ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  2.9 లక్షల ఫోన్లు డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కనెక్ట్ చేశామని, మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పంపడానికి వాడే 18 లక్షల హెడర్లను  బ్లాక్ చేశామని  సింధియా పేర్కొన్నారు. 

బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టాప్ కంపెనీగా మార్చడమే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందరికీ అందేలా చేయడం, మే  నుంచి  5జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మొదలుపెట్టడం తమ లక్ష్యమని సింధియా  పేర్కొన్నారు. బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4జీ కోసం లక్ష బేస్ స్టేషన్లు అందుబాటులోకి తెస్తున్నామని, ఇందులో 50 వేల టవర్లను పూర్తి చేశామని పేర్కొన్నారు. ‘వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– మే నాటికి  లక్ష టవర్లు అందుబాటులోకి వస్తాయి. 4జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందిస్తున్న ప్రభుత్వ సంస్థగా బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారుతుంది. అక్కడి నుంచి 5జీ అమలుపై దృష్టి పెడతాం. 

ఇందుకు అదనపు టవర్లను ఏర్పాటు చేయడంతో పాటు  టెక్నాలజీ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొద్దిగా మారిస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–మే నాటికి కొన్ని ఏరియాల్లో బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5జీ అమల్లోకి వస్తుందని ఆశిద్దాం.  బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టాప్ టెలికం కంపెనీగా మార్చాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇవ్వడంతో పాటు, స్పెక్ట్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటాయించింది. ఇండియాలోని 37 వేల గ్రామాలకు ఇంకా 4జీ కనెక్టివిటీ లేదు. ఏప్రిల్ నాటికి అన్ని ప్రాంతాలకు 4జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందేలా చేయడం తమ టాప్ ప్రయారిటీ’ అని జ్యోతిరాధిత్య సింధియా వివరించారు.