ఆధ్యాత్మికం : పుట్టగానే గతాన్ని మర్చిపోతాం.. కర్మ వెంటాడుతూనే ఉంటుంది.. !

ఆధ్యాత్మికం : పుట్టగానే గతాన్ని మర్చిపోతాం.. కర్మ వెంటాడుతూనే ఉంటుంది.. !

పుట్టినవాడు గిట్టక తప్పదు.. గిట్టిన వాడు పుట్టక తప్పదు..అని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు.  తల్లి కడుపులో పడగానే చాలు గత జన్మలో చేసిన పాప పుణ్యాలు వెంటాడుతాయి. ఇక పిండం శిశువుగా మారి బయట ప్రపంచంలో అడుగు పెట్టగానే గత జన్మలో చేసిన పాప పుణ్యాలను మర్చిపోతాం.. వాటినే కర్మ అంటాం.  అలాంటి కర్మ మనకు తెలియకుండానే ప్రస్తుత జన్మలో ఏరూపంలో ఉన్నా వెంటాడుతూనే ఉంటుంది.  

గతం తాలూకు కర్మల నుంచి నేర్చుకోకుండా ఎందుకు మనం మళ్లీ మళ్లీ పుడుతుంటాం? ఒక వ్యక్తి డిమెన్షియా వ్యాధితో బాధపడుతుంటే.. అతను తన ఫ్యామిలీని మర్చిపోతాడు. అలాగని అతను ఆ ఫ్యామిలీ మెంబర్ కాదంటామా? అలాగే.. గతం తాలూకు కర్మలన్నీ ఎప్పుడూ అతనికి చెందినవే! అవి అతని ఎకౌంట్లోనే ఉంటాయి. ఇది అచ్చంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ లాంటిది. ఎకౌంట్ లో డబ్బు విత్ డ్రా చేసి లేదా డిపాజిట్ చేసి దాని గురించి మర్చిపోవడం లాంటిది. డబ్బు ట్రాన్సాక్షన్ మన పేరు మీదే చూపిస్తుంది. అలాగే, మనం పుట్టగానే.. మన గతాన్ని మర్చిపోతాం. కానీ, మన కర్మలు మాత్రం శరీరంలోనే సూక్ష్మంగా స్టోర్ అవుతాయి. మన మనసు డేటా బ్యాంక్ లాంటిది. 

అది గతం తాలూకు అనుభవాలను, జ్ఞాపకాలను, స్కిల్స్​ ను మైక్రోచిప్ స్టోర్ చేసుకుంటుంది. అయితే, మనిషి తయారు చేసుకునే చిప్ కెపాసిటీ కొంతవరకే పరిమితం. మనసుది మాత్రం అన్​ లిమిటెడ్. అజ్ఞానం వల్ల మన మనసు డేటాను ఉపయోగించుకోకుండా దూరం దూరం తప్పించుకు తిరుగుతుంటాం. అంతేకానీ, దాని అర్థం డేటా పోయిందని కాదు. మన గత కర్మల ఎకౌంట్స్ అన్ని మనసులో స్టోర్ అయ్యి ఉంటాయి. దాని అర్ధం గత కర్మల ఫలితాల నుంచి విముక్తి పొందినట్టు కాదు. 

మన దగ్గర ఉన్న రకరకాల మెడిటేషన్ టెక్నిక్స్.. గత జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. పాత కర్మలతో ఈ కర్మలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ టెక్నిక్స్ దారి చూపిస్తాయి. మనిషి మంచి కర్మ, చెడు కర్మ రెండింటి ఫలాలను అందుకుంటాడు. సంతోషాన్ని, దుఃఖాన్ని రెండింటినీ రుచి చూస్తాడు. ఇదే కర్మ నియమం. 

ఇదే జీవితానికి, పుట్టబోయే జన్మలకూ వర్తిస్తుంది. కాబట్టి, గతం తాలుకూ కర్మల ఫలితాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం గత కర్మల ఎకౌంట్​ ను  బ్యాలెన్స్ చేసి.. కొత్తగా మళ్లీ ఆ ఎకౌంట్ లో చెడు కర్మలను డిపాజిట్ చేయకుండా బతకాలి. లేదంటే చావు-పుట్టుకలు అలాగే కొనసాగుతాయి. దీనికి పరమాత్మతో సంబంధం లేదు కదా మరి..!