తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మోదీ

దేశంలో జరుగుతున్న అభివృద్ధికి అదిలాబాద్ నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  తెలంగాణ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని అదిలాబాద్  సభలో చెప్పారు. అదిలాబాద్    లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు.  తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గడిచిన పదేళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అనేక నిధులు వెచ్చించిందని చెప్పుకొచ్చారు మోదీ. దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ రూ.56వేల కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆదిలాబాద్ ప్రియదర్శిని స్టేడియం నుంచి వర్చువల్ గా  ప్రారంభించారు. NTPC విద్యుత్ ప్లాంట్ జాతికి అంకితమిచ్చారు. అండర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన, ఆదిలాబాద్-బేల-మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, పలు ప్రాంతాల్లో విద్యుదీకరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి,  గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  

Also Read :తెలంగాణకు మోదీ పెద్దన్నలాగా ఉన్నారు : సీఎం రేవంత్ రెడ్డి