ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సూర్యాపేట, వెలుగు : వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్ఫలితాలు సాధ్యం అవుతాయని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట మార్కెట్‌‌‌‌‌‌‌‌ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌, అడిషినల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని, నీరు, నిరంతర కరెంట్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారన్నారు. మార్కెట్ల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డీసీఎంఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వట్టె జానయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌, గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ ఉప్పల లలితా ఆనంద్ పాల్గొన్నారు. 

మోడీని గద్దె దించేందుకు మరో పోరాటం

తుంగతుర్తి, వెలుగు : తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్న ప్రధాని మోడీని గద్దె దించేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాలని మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. శుక్రవారం జరిగిన తిరుమలగిరి మార్కెట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కొమ్మినేని స్రవంతి సతీశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరై, మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను అడ్డుకునేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పని అయిపోయిందని, బీజేపీని ఎదుర్కోవడానికి అందరూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అంతకుముందు చైర్మన్‌‌‌‌‌‌‌‌ కొమ్మినేని స్రవంతి సతీశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ యానాల రాంరెడ్డి, పాలకమండలి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, విజయ్ డెయిరీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ సోమ భరత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పోతరాజు రజిని రాజశేఖర్, ఎంపీపీ స్నేహలత, మున్సిపల్ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎస్. రఘునందన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ పథకాలు దేశానికి  ఆదర్శం

కోదాడ, వెలుగు : తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌  చెప్పారు. కోదాడ పట్టణానికి చెందిన పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌, సీఎం రిలీఫ్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనంతరం కోదాడ సొసైటీ పరిధిలోని పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అంతకుముందు చిలుకూరు మండలం బేతవోలులో కనకదుర్గా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన సుదర్శన నారసింహయాగంలో తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : సర్కార్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పీఐసీయూను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో అన్ని వసతులు కల్పిస్తూ, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ లచ్చూనాయక్, మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ రాజకుమారి పాల్గొన్నారు.

ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌ ఇంటిపై దాడి సరికాదు

యాదాద్రి, వెలుగు : నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌ ఇంటిపై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గూండాల దాడిని వ్యతిరేకిస్తూ శుక్రవారం బీజేపీ లీడర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భువనగిరిలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫ్లెక్సీని దహనం చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తాము తిరగబడితే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎంపీ, ఎమ్మెల్యేలు బయట తిరగలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో చందా మహేందర్‌‌‌‌‌‌‌‌గుప్తా, పాదరాజు ఉమాశంకర్‌‌‌‌‌‌‌‌రావు, రత్నపురం బలరాం, మరాఠీ బీరప్ప, గంగాపురం రమేశ్‌‌‌‌‌‌‌‌, జక్కుల రామచంద్రయ్య యాదవ్, పింగళి విజయభాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, చెడ నాగన్న పాల్గొన్నారు.

బాధ్యులను అరెస్ట్‌ చేయాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌/మిర్యాలగూడ, వెలుగు : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌ ఇంటిపై దాడి సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నర్సింహారెడ్డి అన్నారు. నల్గొండలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సమావేశంలో  నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, పోతెపాక సాంబయ్య, మొరిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే మిర్యాలగూడలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ మహిళా మోర్చా  జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత మాట్లాడారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట రమాదేవి, పందిరి భాగ్యమ్మ, జ్యోతి, సీతమ్మ, నవ్య, లక్ష్మి ఉన్నారు.

కవితపై ఆరోపణలు చేస్తే ఊరుకోం

యాదగిరిగుట్ట, వెలుగు : ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం ఆమె మాట్లాడారు. కవితను వ్యక్తిగతంగా దూషించడం, అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించలేని ఎంపీ.. తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి రైతులను మోసం చేసిన ఆయనకు కవిత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అర్వింద్‌‌‌‌‌‌‌‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అంతకుముందు యాదగిరిగుట్టలో జరిగిన పీఆర్టీయూ జిల్లా కౌన్సిల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మతతత్వ విధానాలతో ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందని ఆల్‌‌‌‌‌‌‌‌ ఇండియా పీస్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌  శాలిడారిటీ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌ (ఐప్సో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీఎల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండలోని పీఆర్టీయూ భవన్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం జరిగిన ఐప్సో జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యుద్ధాల వల్ల ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. సమావేశంలో సభ్యులు రఘుపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఐప్సో జిల్లా ఉపాధ్యక్షడు కట్ట వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అనంతుల శంకరయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌‌‌‌‌‌‌‌వీ.యాదవ్‌‌‌‌‌‌‌‌, నాయకులు దేప నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుర్రం వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పోటీలు ప్రారంభం

నకిరేకల్, వెలుగు: రాష్ట్ర స్థాయి సీనియర్‌‌‌‌‌‌‌‌ గర్ల్స్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌ పోటీలు శుక్రవారం నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌ మండలం మంగళపల్లిలో ప్రారంభం అయ్యాయి. నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఆటలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో గెలిచిన జట్టును నేషనల్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేయనున్నారు. మొదటి రోజు నల్గొండ, రంగారెడ్డి టీం మధ్య పోటీ జరుగగా నల్గొండ టీం గెలిచింది. అంతకుముందు జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర స్థాయి పోటీలను మంగళపల్లిలో నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌ఎం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్‌‌‌‌‌‌‌‌రావు, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కొప్పుల ప్రదీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ప్రగడపు నవీన్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌ మండలం టేకులగూడెం, పాలెం, ఓగోడు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృ-ద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో పాలెం, ఓగోడు సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ఏకుల కవిత విజయ్, అబ్బగోని విజయలక్ష్మి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కొప్పుల ప్రదీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

ఓటరు నమోదుపై అవగాహన సదస్సు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఓటరు నమోదుపై శుక్రవారం నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో జయచంద్ర, కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌శ్యామ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిది అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పొలిటికల్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ శీలం యాదగిరి, పబ్లిక్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ నాగుల వేణు, లెక్చరర్లు యాదగిరిరెడ్డి, మల్లేశ్‌‌‌‌‌‌‌‌, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దుర్గాప్రసాద్, లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, నారాయణరావు, మల్లేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం గ్రంథాలయ  వారోత్సవాల సందర్భంగా స్టూడెంట్లకు క్విజ్‌‌‌‌‌‌‌‌ పోటీలు నిర్వహించారు.

సీపీఎస్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలని సంతకాల సేకరణ

మిర్యాలగూడ, వెలుగు : సీపీఎస్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని అమలు చేయాలంటూ సంతకాలను సేకరించి రాష్ట్రపతికి అందజేస్తామని టీఎస్‌‌‌‌‌‌‌‌ యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కార్యదర్శి నాగమణి చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం నిర్వహించిన సంతకాల సేకరణను కాట్ల మధుసూదన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో టీఎస్‌‌‌‌‌‌‌‌ యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌ పట్టణ ప్రధాన కార్యదర్శి తన్నీరు నాగరాజు, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ పేరం సైదమ్మ, ఎల్‌‌‌‌‌‌‌‌. లక్ష్మి, ఉమాశంకర్, పి. నాగరాజు, సాల్మన్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

మట్టి తరలింపును అడ్డుకోవాలి

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో ప్రభుత్వ భూమి నుంచి కొందరు అధికార పార్టీ లీడర్లు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. శుక్రవారం బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు మీడియాతో మాట్లాడారు. సహజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులే అక్రమాలకు పాల్పడుతూ గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో తొండపు సతీశ్‌‌‌‌‌‌‌‌, నంబూరు సూర్యం, ఉన్నం హనుమంతరావు, బాలబోయిన రాజు, వెంకటాచారి, దేవరశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

బాధిత ఫ్యామిలీలను ఆదుకోవాలి

మునగాల, వెలుగు : సూర్యాపేట జిల్లా మునగాలలో ఇటీవల జరిగిన యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌లో చనిపోయిన, గాయపడిన వారి ఫ్యామిలీలను శుక్రవారం కోదాడ మాజీ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాయపడిన వారికి వైద్యసాయం అందేలా కృషి చేస్తానన్నారు. తన్నీరు ప్రమీల ఉపేందర్‌‌‌‌‌‌‌‌ దంపతుల పిల్లల చదువు ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. చనిపోయిన, గాయపడిన వారి ఫ్యామిలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. హైవే వెంట ఉన్న సర్వీస్‌‌‌‌‌‌‌‌ రోడ్డును పూర్తి చేసేందుకు సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడుతానని చెప్పారు. కార్యక్రమంలో వైస్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య, ఎంపీటీసీ ఉప్పల రజిత, కాసర్ల కల్పన, మండల అధ్యక్షుడు జైపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎలక నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కాసర్ల కోటేశ్వరరావు, జానకీరెడ్డి, వీరబాబు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

నేరేడుచర్ల/గరిడేపల్లి, వెలుగు : ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటానని, అర్థరాత్రి తలుపు తట్టినా అండగా ఉంటానని హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. నియోజకవర్గానికి చెందిన పలువురు శుక్రవారం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఫ్యామిలీకి ఏదో ఒక పథకం అందుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 3,670 కోట్లతో అభివృ-ద్ధి పనులు చేపట్టామన్నారు. రామస్వామి గుట్ట వద్ద ఉన్న డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల రిపేర్లకు రూ. 30 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు చల్లా శ్రీలతారెడ్డి, అరిబండి సురేశ్‌‌‌‌‌‌‌‌బాబు, డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుర్రం మార్కండేయ, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వల్లంశెట్ల రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు పాల్గొన్నారు. అనంతరం గరిడేపల్లి మండలం అప్పనపేట శివారులోని ముత్యాలమ్మ గుడి వద్ద సర్వారం పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వీరంరెడ్డి శంభిరెడ్డి, పరెడ్డిగూడెం సర్పంచ్‌‌‌‌‌‌‌‌ లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 
ప్రారంభించారు.

చదువుతో పాటు ఆటలూ అవసరం

యాదాద్రి, వెలుగు : చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమేనని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి చెప్పారు. భువనగిరి కేంద్రీయ విద్యాలయంలో 7 నుంచి 10వ తరగతి స్టూడెంట్లకు నిర్వహించిన ఆటల పోటీలను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా స్టూడెంట్లు ఆటల్లో పాల్గొనాలని సూచించారు. ఆటలతో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు, పోటీతత్వం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రీజినల్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో ప్రతిభ చూపిన హరిణిరెడ్డి, కుశాల్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ ప్రియారాణి, హాకీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ అలీఖాన్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే ‘వరల్డ్‌‌‌‌‌‌‌‌ టాయిలెట్‌‌‌‌‌‌‌‌ డే’ సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా రన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సూచించారు. అనంతరం స్కూళ్లు, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలు, గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు.