ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని జగన్ సహ వైసీపీ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు, కండువా ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. గేటు వద్ద నుంచే నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లారు.
అనంతరం సభనుద్దేశించి గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టగా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగించారు. అశాస్తీయంగా జరిగిన విభజనతో ఏపీకి నష్టం జరిగిందని.. విభజనతో రెవెన్యూలోటు కారణంగా రాష్ట్రం ఒడిదుడుకులు ఎదుర్కొందన్నారు.
Also Read :- జగన్ చేతిలోని ప్లకార్డులు చింపేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. 2014 నుంచి-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయన్నారు. 2014- నుంచి19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగిందని, పోలవరాన్ని 75 శాతానికి పైగా పూర్తి చేశామన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగి రాష్ట్రం వెనకబడిందన్నారు.