వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం

వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: మూడు అంచెల అరోగ్య వ్యవస్థను 5 అంచెలుగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆరోగ్యం పట్ల, ముందు జాగ్రత్త చర్యల పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఐడియా క్లినిక్స్ సోమాజిగూడ పార్క్ హోటల్లో డయాబెటిక్, ఎండో క్రైనాలజీ రీసెర్చ్ అప్డేట్ -2022 సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి హరీశ్ రావు. 
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్యను 33 కి పెరిగిందన్నారు. తక్కువ ఖర్చులో వైద్య విద్య కోసం ఎవరూ చైనా, ఉక్రెయిన్ తదితర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మెడిసిన్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులపై కూడా దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆరోగ్యం పట్ల  ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.... అవసరమైన మందులు అందిస్తున్నామన్నారు మంత్రి హరీశ్ రావు.