
మంచి సంకల్పం, పరిపాలనతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హాజరయ్యారు భట్టీ. వేద పండితుల పంచాంగం విన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన భట్టీ.. ప్రజలందరూ ఉగాది పచ్చడి లాగా షడ్రుచులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పీచ్:
- పంచాంగంలో ఈ సంవత్సరం రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని చెప్పారు.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము.
- మంచి వర్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.
- మంచి పాలనతో, మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి, మంత్రివర్గంతో రాష్ట్రం ముందుకు వెళుతుంది.
- ప్రజలందరికీ అన్ని రకాలుగా వసతులు కల్పించే విధంగా, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా, అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నాం.
- అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ తీసుకొచ్చాం.
- ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ నగర అభివృద్ధి, త్రిబుల్ ఆర్ వంటి అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.
- ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా.