అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎలక్షన్లకు ఇంకా వారం గడువే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పోరాటం వచ్చే ఎన్నికల కోసం కాదని.. రాబోయే తరం బాగు కోసమని చెప్పారు. తర్వాతి తరానికి మంచి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు. ఎన్ఆర్ఐ కమ్యూనిటీతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Amritsar | We are not fighting this election for the next election, but for the next generation: Navjot Singh Sidhu, Punjab Congress chief during his interaction with the NRI community
— ANI (@ANI) February 13, 2022
Punjab goes to polls on 20th February pic.twitter.com/D9YKG7hMJx
పంజాబ్ లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఇకపోతే, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పవర్ లోకి వస్తే.. సిద్ధూకు ‘సూపర్ సీఎం’ వస్తుందని ఆ పార్టీ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఈనెల ప్రారంభంలో కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘పేదరికం, ఆకలిని అర్థం చేసుకునే పేదింటి నుంచి వచ్చిన సీఎం పంజాబ్ ప్రజలకు చాలా అవసరం’ అని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సిద్ధూ కూడా స్వాగతించారు. అధిష్టానం నిర్ణయంతో ఎవరికీ ఎలాంటి సమస్య లేదని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం: