గల్వాన్‌ గొడవలో మా బాధ్యత లేదు

ఇండియన్ సోల్జర్లే బోర్డర్ దాటి దాడి చేసిన్రు
చైనా ఎంబసీ మ్యాగజైన్లో అంబాసిడర్ సన్ వీడాంగ్ ఆర్టికల్

న్యూఢిల్లీ, బీజింగ్: తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జూన్ 15న ఇండియా, చైనా సోల్జర్ల మధ్య జరిగిన గొడవకు తమ బాధ్యత ఏమీ లేదని చైనా మరోసారి వాదనలు షురూ చేసింది. ఇండియన్ సోల్జర్లే ఎల్ఏసీ వద్ద బోర్డర్ దాటి తమ సోల్జర్లపై దాడికి పాల్పడ్డారని పేర్కొంది. బోర్డర్ దాటిన సోల్జర్లపై చర్యలు తీసుకోవాలని, సైనికులు డిసిప్లీన్ గా ఉండేలా చూసుకోవాలని ఇండియాను కోరింది. ఈ మేరకు ఇండియాలో చైనీస్ అంబాసిడర్ సన్ వీ డాంగ్ ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ పబ్లిష్ చేసిన ‘చైనా-ఇండియా’ మ్యాగజైన్ లో ఆర్టికల్ రాశారు. ఇరుదేశాల మధ్య బోర్డర్ వద్ద మే 5న మొదలైన వివాదానికి వంద రోజులు అయిన సందర్భంగా ఆయన ఈ ఆర్టికల్ లో మరోసారి చైనా వాదనలను వినిపించారు. గల్వాన్ వ్యాలీ గొడవలో 20 మంది ఇండియన్ సోల్జర్లు చనిపోగా, చైనా వైపు 40 మంది చనిపోయారు. తమ సోల్జర్ల మరణాల సంఖ్యను చైనా వెల్లడించలేదు. అయితే, ‘‘ఆ గొడవను జాగ్రత్తగా అనలైజ్ చేస్తే.. అందులో చైనా బాధ్యత ఏమీ లేదని క్లియర్ గా తెలుస్తుంది. ఇండియన్ సోల్జర్లే బోర్డర్ డిస్పూట్స్ పై అగ్రిమెంట్లను ఉల్లంఘించారు. దీనిపై ఇండియా ఇన్వెస్టిగేషన్ చేసి, ఉల్లంఘనలకు పాల్పడిన సోల్జర్లపై చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు మళ్లీజరగకుండా చూసుకోవాలి’’ అని సన్ వీడాంగ్ పేర్కొన్నారు. గల్వాన్ వ్యాలీ గొడవ విచారకరమని, దాని కారణంగా ఇరుదేశాలు తప్పుదోవ పట్టకుండా, మంచి సంబంధాలను కొనసాగించే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు.

చైనా వెనక్కి వెళ్లాల్సిందే..
తూర్పు లడఖ్ లోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య పాంగాంగ్ సో, గోగ్రా, దేప్సాంగ్ ఏరియాల నుంచి చైనా బలగాలు ముందుగా వెనక్కి వెళ్లాల్సిందేనని, ఎల్ఏసీ వెంబడి అన్ని ఏరియాల్లో మే 5కు ముందు ఉన్న పరిస్థితి తిరిగి నెలకొనాల్సిందేనని డ్రాగన్ కంట్రీకి మన దేశం తెగేసి చెప్పింది. ఎల్ఏసీ వెంబడి పలు చోట్ల చైనీస్ బలగాలు వెనక్కివెళ్లకుండా ఇంకా తిష్టవేసి ఉన్న నేపథ్యంలో శుక్రవారం చైనాలో ఇండియన్ అంబాసిడర్ విక్రమ్ మిస్రీ బీజింగ్ లో ఆ దేశ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సీనియర్ ఆర్మీ జనరల్ సీ గువేతో భేటీ అయ్యారు.

For More News..

బలపరీక్షలో గెహ్లాట్ పాస్