మళ్లీ పవర్ మాదే

2014 కంటే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.దేశవ్యాప్తం గా బీజేపీ ప్రభంజనం వీస్తోందన్నారు. భిన్నసిద్దాంతాలు గల ప్రతిపక్షాలు కేవలం అధికారం కోసమే పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలకు అధికారంలోకి రావాలన్న కోరిక తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక రాజకీయ, సామాజిక అంశాలపై ప్రధాని మోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు ప్రతిపక్షాలు తమపై ఎన్ని విమర్శలు చేసినా,ఎంతగా దుష్ప్రచారం చేసినా మరోసారి ఎన్డీయే సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ తెగేసి చెప్పారు. అంతేకాదు 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం తమకే ఉందన్నారు. బీజేపీకి బంపర్ మెజారిటీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిం చారు. ఏ రాష్ట్రా నికి వెళ్లినా అక్కడ బీజేపీ ప్రభంజనాన్ని నేను చూశాను. 2014 లో మిత్రపక్షాల సాయంతో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఈసారి భారతీయ జనతా ( దేశ ప్రజలు ) అండతో బీజేపీ పోటీ చేస్తోంది. ప్రధానిగా ఉన్న ఐదేళ్లలో అనుక్షణం బాధ్యతగా ఫీలయ్యానన్నారు. దేశం కోసం పెద్ద బాధ్యత మోస్తున్నానన్న ఫీలింగ్ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నా రు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచి రెండోసారి ప్రధాని అయితే ఏం చేస్తానో ఇప్పుడే చెప్పలేనన్నారు. మే 23 తర్వాత ఈ విషయం పై మాట్లాడతానన్నారు.

యూపీలో సీట్లు తగ్గే ప్రసక్తే లేదు…

అఖిలేశ్ యాదవ్, మాయావతి కూటమి వల్ల ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ సీట్లు తగ్గు తాయనుకోవడం భ్రమే అని తేల్చి చెప్పారు మోడీ. యూపీ ప్రజలను తక్కువగా అంచనా వేయకూడదన్నారు. గతంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకున్న సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఒక వేదిక మీదకు వచ్చాయన్న చిన్న విషయం తెలుసుకోలేనంత అమాయకులు యూపీ ప్రజలు కారన్నారు. ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నరోజులు యూపీ ప్రజలకు ఇంకా గుర్తున్నా యన్నారు. ఎవరు ఎవరితో కలిసినా ఉత్తరప్రదేశ్ ప్రజలు విజన్ కే పట్టం కడతారన్న నమ్మకం తనకుందని ప్రధాని చెప్పారు.

 టికెట్లు ఇచ్చే అధికారం నాకు లేదు….

సిట్టింగ్ ఎంపీల్లో మూడో వంతు మందికి టికెట్లు రాకపోవడానికి తాను కారణం కాదని మోడీ స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గాని కి ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవడానికి పార్టీకి అనుబంధంగా ఎలక్షన్ కమిషన్ అలాగే పార్లమెంటరీ బోర్డు ఉన్నాయన్నా రు. టికె ట్ల విషయాన్ని ఈ రెండు వేదికలే చూసుకుంటా యన్నారు. అయితే టికె ట్లు రానంత మాత్రాన పార్టీకి వారి కంట్రిబ్యూషన్ ఏమీ లేదని అనుకోవడం కరెక్ట్ కాదని మోడీ చెప్పారు. టికె ట్లు ఇవ్వడానికి అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయని ఆయన వివరణ ఇచ్చారు.

అసలైన సమస్యలంటే….

ఎమోషన్ ఇష్యూస్ కే ప్రయారిటీ ఇస్తూ దేశానికి సంబంధించి న అసలైన సమస్యలను తాను పట్టించుకోవడం లేదన్న విమర్శ ను మోడీ తోసిపుచ్చారు. ‘ టెర్రరిజం …అసలైన సమస్య కాదా ? టెర్రరిజం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటం వాస్తవం కాదా ? సరిహద్దుల్లో మన వీర జవాన్లు దొంగదెబ్బకు బలి కావడం వాస్తవం కాదా ? ’ అని ఆయన సూటి గా ప్రశ్నిం చారు. సైనికుల త్యాగాలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నదన్న విమర్శ లో ఏమాత్రం పసలేదన్నా రు. సైన్యా న్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నదే బీజేపీ సిద్ధాం తమని పేర్కొన్నారు.వాస్తవానికి సైనికు ల త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుం ది కాం గ్రెస్ పార్టీయేనని ప్రధాని ఎదురు దాడి చేశారు. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం సందర్బం గా ఇండియా సైన్యం వీరోచిత పోరాటాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుం ది ఇందిరా గాం ధీనే అని మోడీ గుర్తు చేశారు. మీడియా ఈ విషయాన్ని అప్పట్లో పట్టిం చుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అలాగే వాజ్ పేయి హయాం లో శవ పేటికల పేరుతో బూటకపు కుం భకోణాన్ని సృష్టించింది కూడా కాం గ్రెసేనన్నా రు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ టూ వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవని మోడీ తేల్చి చెప్పారు. రక్షణ రంగ నిపుణులతో చర్చించి న తర్వాతే సర్జికల్ స్ట్రైక్స్ టూ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రధాని క్లారిటీ ఇచ్చారు. రక్షణ రంగానికి సంబంధించిన అన్ని అంశాల్లో కేవలం దేశ ప్రయోజనాలనే ఎన్డీయే సర్కార్ చూసిందని ప్రధాని పేర్కొన్నారు. రాఫెల్ పై సుప్రీంకోర్టులో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్ల లో అక్రమాలు జరగలేదని ఎన్నిసార్లు చెప్పినా వినడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని మోడీ ఆరోపిం చారు. ప్రతిపక్షాలు సుప్రీం కోర్టుకు వెళ్లాయన్నా రు. సుప్రీం కోర్టులోఏం జరిగిందో అందరికీ తెలిసిందేనన్నారు.అలాగే కాగ్ రిపోర్ట్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా లేదన్నారు. ఇంత జరిగినా రాఫెల్ పై ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

అన్ని పథకాల్లోనూ అంతర్లీనంగా దేశ భక్తి ….

బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాల్లోనూ అంతర్లీనంగా దేశభక్తి ఉందన్నా రు. ‘‘స్వచ్ఛ భారత్ లో దేశభక్తి ఉంది. గూడు లేని పేద ప్రజలకు పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చే పథకంలోనూ దేశభక్తి ఉంది. అయితే మా ప్రత్యర్థులు ఈ విషయాన్నిఅర్థం చేసుకోవడం లే ” దని ప్రధాని ఆరోపిం చారు. బీజేపీ దేశభక్తికి ‘ హైపర్ నేషనలిజం ’ పేరు పెట్టి తమ మీద సిద్ధాం తపరంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నా రని విమర్శించారు. మే 23 తర్వాత కేంద్రం లో తమ ప్రభుత్వమే వస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

–‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సౌజన్యం తో