
విక్కీ కౌశల్, రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రం ‘ఛావా’. రీసెంట్‌గా హిందీలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ నెల 7న తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. సోమవారం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా హిందీలో పెద్ద ప్రభంజనం సృష్టించింది. అంత మంచి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం.
భాష ఏదైనా మంచి సినిమా అయితే దాన్ని తెలుగులో తీసుకురావడానికి గీతా ఆర్ట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఇది మన చరిత్రని అద్భుతంగా చిత్రీకరించిన సినిమా. అన్ని జాగ్రత్తలు తీసుకుని తెలుగులో డబ్బింగ్ చేశాం. దీన్ని తెలుగు ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరిస్తారని నమ్మకం ఉంది’ అని అన్నారు.