ఒక విద్యార్థి మీద లక్ష 20 వేలు ఖర్చు చేస్తున్నం : సబితా ఇంద్రారెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :  రాష్ట్రంలో చదువుకున్న ప్రతీ విద్యార్థి ప్రపంచంలో తలెత్తుకుని తిరిగేలా  చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో  ప్రవేశపెట్టిన  కేజీ టు పీజీ విద్యను అంచెలంచెలుగా ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెయ్యి గురుకులలో ఒక విద్యార్థి పేరు మీద లక్ష 20 వేలు ఖర్చు చేస్తున్నమన్నారు.

మన ఊరు మన బడి  కార్యక్రమంలో  భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 1,200 స్కూళ్లను ఎంపిక చేయడం జరిగిందని మంత్రి సబిత తెలిపారు. కరోనా ప్రభావంతో గత రెండు సంవత్సరాలు విద్యార్థులకు కొంత  ఇబ్బంది ఏర్పడినప్పటికీ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా చేశామన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి  ప్రతీ విద్యార్థి కలలు కనండి.. మీ పక్షనా  ప్రభుత్వం ఉంటుందని  విద్యార్థులకు సబిత సూచించారు. 

విద్యాతో పాటుగా  వైద్యం, వ్యవసాయం ,ఉపాధి లాంటి అన్ని రంగాలకు ఆటంకం లేకుండా ముందుకు పోతున్నామని మంత్రి సబిత తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన  చిన్న జిల్లాలు అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నాయని ఆమె స్పష్టం చేశారు.