- 3వ తేదీ నుండి రెండో విడత పట్టణ ప్రగతి
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: గత ప్రభుత్వాలు నాలాలు కబ్జా అయినా పట్టించుకోలేదని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలాల కబ్జాపై శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈనెల 3వ తేదీ నుండి రెండో విడత పట్టణ ప్రగతి ప్రారంభిస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రగతిపై సమీక్ష జరిగింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన పట్టణ ప్రగతి సమీక్షలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, నగర ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జోనల్, వార్డు స్థాయిలో మీటింగులు నిర్వహించామని.. నాలాలు, పారిశుధ్యం, హరిత హారంలో నాటిన చెట్లు తదితర వాటిపై ఫోకస్ చేస్తున్నామన్నారు. గతంలో ఐదు లక్షల రూపాయల పనులు చేయాలంటే సంవత్సరాలు పట్టేది, కానీ నేడు వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
మన అభివృద్ధిని మనం చెప్పుకోవడం కాదు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పర్యాటకులు చెబుతున్నారని తెలిపారు. స్కూళ్లు బాగుపడ్డాయని, అలాగే సర్కార్ ఆసుపత్రులు మెరుగయ్యాయని చెప్పారు. ‘నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములుగా అవండి’ అని మంత్రి తలసాని కోరారు. కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, దోమల సమస్య, వీది కుక్కలు గురించి చెప్పారని తెలిపారు. తమకు డబ్బు ముఖ్యం కాదు ప్రజలకు పని జరిగిందా అనేది ముఖ్యం అని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్