కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు లేరు.. 10ఏళ్లు రేవంత్ రెడ్డే మా సీఎం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు... అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  10 ఏళ్లపాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం నల్లగొండ ఈద్గా దగ్గర రంజాన్ వేడుకల్లో సీనియర్ నేత జానారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..  కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. దేశా ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండేలు లేరని.. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ఆయన చెప్పారు.  ఏకనాథ్ షిండే ను సృష్టించిందే బీజేపీ పార్టీ అని దుయ్యబట్టారు.

హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని..  పనికిరాని చిట్ చాట్ లు బంద్ చేయాలని సూచించారు.  మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దని..  బండి సంజయ్ ను ఎందుకు మార్చారో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా.. తాను దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు.