Champions Trophy: మేము ఏ జట్టునైనా ఓడించగలం.. భారత జట్టుకు బంగ్లా కెప్టెన్ హెచ్చరికలు

Champions Trophy: మేము ఏ జట్టునైనా ఓడించగలం.. భారత జట్టుకు బంగ్లా కెప్టెన్ హెచ్చరికలు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తొలి పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. గురువారం (ఫిబ్రవరి 20) దుబాయ్ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో.. రోహిత్ సేనకు గట్టి హెచ్చరికలు పంపాడు. తమను తేలిగ్గా తీసుకోవద్దని.. ఏ జట్టునైనా అలవోకగా ఓడించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు. 

పేస్ మా ఆయుధం..

"మునుపటి బంగ్లాదేశ్ జట్టుకు.. ఇప్పటికీ చాలా ఉంది. ఒకప్పుడు జట్టులో సరైన పేసర్లు లేక ఇబ్బంది పడ్డాం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత రెండేళ్లలో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు జట్టులోకి వచ్చారు. నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్ మా ప్రధాన పేసర్లు. వీరు సంధించే వేగం జట్టులో కష్టాలు తీరుస్తుంది. ఇంకో సగం మేము కస్టపడితే చాలు.."

Also Read : ఐసీసీ రూల్‌కు పాకిస్థాన్ బలి

"ముఖ్యంగా, నహిద్ రాణా జాతీయ జట్టులోకి వచ్చిన నాటి ఆకట్టుకున్నాడు. వేగం, ఖచ్చితత్వం రెండూ అతని సొంతం. బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో అతని ప్రదర్శనలే.. అందుకు నిదర్శనం. మైదానంలో అతను బౌలింగ్ చేసే విధానం.. మిగిలిన బౌలర్లలో కసిని పెంచుతుంది. ప్రత్యర్థులను సవాలు చేయడానికి అది మాకున్న మరో అవకాశం. ఈ టోర్నీలో ఎవరినైనా.. ఏ జట్టునైనా ఓడించగలమని మేము నమ్ముతున్నాము. ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే, మేం ఎవరినైనా ఓడించగలం.." అని మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో శాంటో మాట్లాడాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, పర్వేజ్ హస్సన్, నసుమ్ మహ్మద్, తాంజిమ్ హసన్, నహిద్ రాణా.

బంగ్లాదేశ్ మ్యాచ్‌ల షెడ్యూల్

  • ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs ఇండియా (దుబాయ్)
  • ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి, పాకిస్తాన్)
  • ఫిబ్రవరి 27: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి, పాకిస్తాన్)