మాదాపూర్, వెలుగు: అన్ని రకాల జీవులకు అవసరమైన నీటి వనరులను రక్షించుకోవల్సిన బాధ్యత మనపై ఉందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘వాటర్న్యూ కరెన్సీ’ అనే థీమ్‌తో 30వ ఇండియన్ప్లంబింగ్కాన్ఫరెన్స్ప్రారంభమైంది. మూడ్రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి వీడియో పంపించారు. అందులో మంత్రి మాట్లాడుతూ.. సహజ వనరు అయిన నీటి ప్రాముఖ్యతను ఎవరూ గుర్తించటం లేదన్నారు. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన, సురక్షితమైన నీటిని ప్లంబింగ్ పరిశ్రమలు అందించాలని సూచించారు. ఇండియాలోని డెన్మార్క్ రాయబారి సోరెన్నార్కెలుండ్కన్నిక్మార్క్వార్డ్సెన్, ఇండియన్ ప్లంబింగ్అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గుర్మీత్‌సింగ్ అరోరా పాల్గొన్నారు.