ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై పందెం కాసి ఓడిపోయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి(ముద్రగడ పద్మనాభం)కి కష్టాలు తప్పట్లేదు. పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని అన్న మాట ప్రకారం 'రెడ్డి'గా ఆయన పేరు కూడా మార్చుకున్నారు. అయినప్పటికీ.. జనసేన పార్టీ, ఆ పార్టీ శ్రేణులు ఆయనను వేధించడం ఆపట్లేరట.
జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం బూతు మేసేజ్‌లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని ముద్రగడ ఆరోపించారు. అంతకంటే, మనుషుల్ని పంపి తమ కుటుంబాన్ని అంతమొందించాలని ఆ పార్టీ అగ్రనేతలకు ఆయన సూచించారు.
"జనసేన పార్టీ(@JanaSenaParty) వాళ్ళు నిత్యం బూతు మేసేజ్‌లు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం కంటే కూడా మా కుటుంబంలో ఏడుగురు ఉన్నాం.. మనుషుల్ని పంపించి చంపించేయండి. చాలా చోట్ల వైసీపీకి ఓట్లు వేసిన వారి మీద, వారి ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటిది గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు.. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా ఇలాంటి పనులు ఆపమని మీవాళ్ళకు చెప్పండి.." అని వైయస్ఆర్ సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
.@JanaSenaParty వాళ్ళు నిత్యం బూతు మేసేజ్ లు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలా చేయడం కంటే కూడా మా కుటుంబంలో ఏడుగురు ఉన్నాం మనుషుల్ని పంపించి చంపించేయండి
— YSR Congress Party (@YSRCParty) June 21, 2024
చాలా చోట్ల వైసీపీకి ఓట్లు వేసిన వారి మీద వారి ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ఇలాంటిది ఏ ప్రభుత్వంలో చూడలేదు ఇది మంచి పద్ధతి… pic.twitter.com/RJyATzW6Ga